Karimnagar District: లిఫ్ట్ ఇస్తానన్న ఊరి యువకుడు.. మార్గమధ్యంలో అత్యాచారం!

  • కరీంనగర్ వెళ్లేందుకు వేచి చూస్తున్న యువతి
  • బైక్ పై వచ్చి డ్రాప్ చేస్తానన్న అదే గ్రామ యువకుడు
  • మార్గమధ్యంలో బెదిరించి అత్యాచారం
తెలిసిన వ్యక్తి, వేగంగా గమ్యానికి చేరుస్తాడని నమ్మి బైక్ ఎక్కిన పాపానికి అత్యాచారానికి గురైందో యువతి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఇక్కడి కొరటపల్లి ప్రాంతానికి చెందిన యువతి కరీంనగర్ వెళ్లేందుకు వేచి చూస్తుండగా, అదే గ్రామానికి చెందిన మేకల సురేష్ అనే వ్యక్తి బైక్ పై వచ్చాడు.

తాను కూడా కరీంనగర్ కే వెళుతున్నానని, వెంట రావాలని కోరడంతో, రోజూ చూసే వ్యక్తేకదా అని ఆమె బైక్ ఎక్కింది. మార్గమధ్యంలో కొక్కెరకుంట ప్రాంతంలో బండి ఆపిన నరేష్, బెదిరించి, భయానికి గురి చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమె పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Karimnagar District
Two Wheeler

More Telugu News