ఇక సునీల్ పొడిచేస్తాడని అన్నారు .. కానీ అలా జరగడంలేదు: కమెడియన్ పృథ్వీ సెటైర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక సునీల్ పొడిచేస్తాడని అన్నారు .. కానీ అలా జరగడంలేదు: కమెడియన్ పృథ్వీ సెటైర్

  • ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుంది 
  • కమెడియన్ గా నా స్థానానికి ఢోకా లేదు
  • హీరోగా చేశాక కమెడియన్ ఆదరణ పొందడం కష్టం   
తెలుగు తెరపై హాస్యనటుడిగా పృథ్వీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రూపం పరంగా తాను కమెడియన్ గా కనిపించననీ, కానీ తన మేనరిజమ్స్ .. డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను నవ్విస్తాయని చెప్పే పృథ్వీ త్వరలో 'బ్లఫ్ మాస్టర్' సినిమాతో పలకరించనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .."చిత్రపరిశ్రమలో ఒక్కోసారి ఒక్కొక్కరికి టైమ్ వస్తుంటుంది. అలా బ్రహ్మానందం .. ఆ తరువాత సునీల్ కి టైమ్ వచ్చింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్ గా నా స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. కామెడీని వదిలేసి సునీల్ ఏడేళ్లపాటు హీరోగా చేశాడు .. మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా చేస్తున్నాడు. సునీల్ మళ్లీ వచ్చేస్తున్నాడనీ .. అది చేస్తాడనీ ..ఇది చేస్తాడనీ .. పొడిచేస్తాడని అన్నారు. కానీ ఈసారి ఆయన కమెడియన్ గా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాడు. ఏడేళ్లపాటు హీరోగా చేసిన తరువాత మళ్లీ కమెడియన్ గా ప్రేక్షకులు ఒప్పుకోవడం కష్టమేననేది నా అభిప్రాయం" అని ఆయన చెప్పుకొచ్చారు.    
pruthvi

More Telugu News