governor: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన గవర్నర్‌

షార్ట్స్‌లో చూడండి
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌ తిరుమల శ్రీవారి ఆలయాన్ని సోమవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం జరగనున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఆరాతీశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ల్లోని భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరాతీశారు. నరసింహన్‌ ఆకస్మిక రాకతో ఆలయ వర్గాలు ఆశ్చర్యపోయాయి.

ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ తిరుమలలో వైకుంఠం ఏకాదశి ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని, భక్తులకు స్వామి దర్శనం సౌకర్యవంతంగా జరుగుతుందని తెలిపారు. కాగా, రేపు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారదర్శనం అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ తిరుగు ప్రయాణం కానున్నారని  సమాచారం.
Go Back to Shorts
governor
Tirumala

More Telugu News