kcr: కేసీఆర్ ‘రిటర్న్ గిఫ్ట్’ సెటైర్లపై చంద్రబాబు స్పందన!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టి తమకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు, తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఈ సెటైర్లపై చంద్రబాబు స్పందించారు.

"అక్కడ ఉండే ముఖ్యమంత్రి ఇక్కడికొచ్చి నాకేదో ‘గిఫ్ట్’ ఇస్తానని అంటున్నాడు. డెమోక్రసీలో ఎవరొచ్చి ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించుకోవడానికి ఎక్కడికైనా రావొచ్చు. తెలుగుజాతి కోసం తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావుగారు పెట్టారు. కొంతమంది అటూఇటూ లాలూచీలు పడొచ్చుకానీ, తెలుగువాళ్లు ఎక్కడున్నా పని చేశాం. కొంత మంది విమర్శిస్తారు.. బెదిరిస్తారు. తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం పని చేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం అంకిత భావంతో పని చేస్తుంది.’ అని బదులిచ్చారు.
Go Back to Shorts
kcr
Chandrababu
Andhra Pradesh
Telangana
TRS
Telugudesam

More Telugu News