kcr: రేపు చాలా మంచిరోజు.. కొన్ని ముహూర్తాలు కేసీఆర్ కు చెప్పామన్న పండితులు

షార్ట్స్‌లో చూడండి
రెండోసారి సీఎంగా కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని చెబుతున్నప్పటికీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ భవన్ వద్ద ఈ విషయమై పండితుడు గోపీకృష్ణ మాట్లాడుతూ, ముహూర్తం గురించి ఇంకా స్పష్టత లేదని, అయితే, అన్ని ముహూర్తాలు బాగున్నాయని చెప్పారు. ఈ ఐదేళ్లు ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పరిపాలించి స్వర్ణ తెలంగాణను సిద్ధింపజేస్తారని అభిప్రాయపడ్డారు.

అక్కడే ఉన్న మరో పండితుడు మాట్లాడుతూ, రేపు సుబ్రహ్మణ్య షష్ఠి , చాలా మంచిరోజు, తారకాసురుడిని సుబ్రహ్మణ్యస్వామి సంహరించిన రోజని అన్నారు. లోకాలన్నింటిని సుభిక్షంగా ఉంచినటువంటి రోజు రేపు, అటువంటి మంచిరోజున కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పారు. యావత్తు తెలంగాణ అంతా సస్యశ్యామలమై, సుభిక్షంగా, ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండేలా ఈ ముహూర్తం నిర్ణయించామని, రేపు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలోపు ఏ సమయంలోనైనా ఈ ముహూర్తం ఉంటుందని చెప్పిన ఆయన, అసలు ముహూర్తం సమయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.
Go Back to Shorts
kcr
Telanganabhavan
TRS
cm

More Telugu News