kcr: 'ఆడు మగాడ్రా బుజ్జీ'... కోనసీమలో కేసీఆర్ కటౌట్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీలో కూడా అభిమానులున్నారనే విషయం తెలిసింది. ఈ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత ఏపీ నుంచి అయనకు భారీ సంఖ్యలో అభినందనల సందేశాలు వస్తున్నాయి. ఏపీ నుంచి లక్షలాది మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వచ్చాయని నిన్న స్వయంగా కేసీఆరే చెప్పారు. మరోవైపు, రావులపాలెంలోని కోనసీమ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్లెక్సీపై కేసీఆర్ ఫొటోను ముద్రించారు. పైభాగంలో అటూ ఇటూ కేటీఆర్, హరీష్ రావుల ఫొటోలను ఉంచారు. దీనిపై 'ఆడు మగాడ్రా బుజ్జీ' అంటూ క్యాప్షన్ పెట్టారు. 
kcr
flexy
konaseema
ravulapalem
TRS
ap

More Telugu News