parasuram: గీతా ఆర్ట్స్ లోనే 'గీతగోవిందం' దర్శకుడు

షార్ట్స్‌లో చూడండి
గీతా ఆర్ట్స్ లో 'గీత గోవిందం' చేసిన దర్శకుడు పరశురామ్, ఆ బ్యానర్ కి సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలలో ఈ సినిమా కొత్త కోణంలో ఆవిష్కరించబడింది. యూత్ నుంచి .. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో పరశురామ్ తో మరో సినిమా చేసే ఆలోచనలో గీతా ఆర్ట్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆయన దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. దాంతో పరశురామ్ ఏ బ్యానర్లో సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే సినిమా చేయనున్నాడనేది తాజా సమాచారం. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయట. ఇక మైత్రీ మూవీ మేకర్స్ వారి కోసం కూడా ఆయన ఆల్రెడీ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.  
Go Back to Shorts
parasuram

More Telugu News