kukatpallu: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతల ఫిర్యాదు

హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో టీఆర్ఎస్ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. స్థానిక బాలాజీనగర్ లోని టీడీపీ నేత నాగేంద్రపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అపార్టుమెంట్ లో ఉన్న నాగేంద్రపై ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. కాగా, బాలాజీనగర్ లో మద్యం పంపిణీ చేస్తున్న వ్యక్తిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 
kukatpallu
Telugudesam
TRS
balajinagar

More Telugu News