టీఆర్ఎస్ తరఫున ప్రచారానికి జగన్ సిద్ధమయ్యాడు.. కానీ కేటీఆర్ అడ్డుపడ్డాడు!: వర్ల రామయ్య
- కేసీఆర్ హామీల అమలులో విఫలమయ్యారు
- అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన నేత
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేవేస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన బీజేపీకి వేసినట్లేనని స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణలో ఏ ప్రాజెక్టులనూ అడ్డుకోలేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానని వైసీపీ అధినేత జగన్ ముందుకొచ్చారని రామయ్య ఆరోపించారు. అయితే అందుకు మంత్రి కేటీఆర్ అంగీకరించలేదనీ, ప్రచారం చేయాల్సిన అవసరం లేదని సున్నితంగా ఆయన ప్రతిపాదనను తిరస్కరించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారో, ఎవరి పక్షాన నిలబడ్డారో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.