అఖిల్ కోసం ట్రై చేసిన శ్రీను వైట్ల .. నో చెప్పిన నాగ్
- వరుస పరాజయాలతో శ్రీను వైట్ల
- సరైన హిట్ లేని అఖిల్
- తేల్చిచెప్పేసిన నాగార్జున
నాగార్జునతో శ్రీను వైట్లకి మంచి సాన్నిహిత్యం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కింగ్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి నాగార్జునను 'కింగ్' నాగార్జున అనే అంటారు. శ్రీను వైట్ల టేకింగ్ స్టైల్ నచ్చిన కారణంగా కొంతకాలం క్రితం వరకూ ఆయనతో అఖిల్ సినిమా చేయాలనే నాగ్ అనుకున్నారు. కానీ శ్రీను వైట్ల వరుస పరాజయాలు మూటగట్టుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు మరో వైపున అఖిల్ కి కూడా ఇంతవరకూ సరైన హిట్ పడలేదు. అందువల్లనే అఖిల్ తో చేయాలనుకున్న శ్రీను వైట్లకి నాగార్జున నుంచి 'నో' అనే ఆన్సర్ వచ్చిందని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.