పెద్ద నోట్ల రద్దు దారుణ నిర్ణయం.. మోదీకి షాకిచ్చిన అరవింద్ సుబ్రమణియన్
- నోట్ల రద్దు అనూహ్య పరిణామం
- జీడీపీ వృద్ధి పడిపోయింది
- ప్రపంచంలో ఏ దేశమూ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు
ప్రపంచలోని ఏ దేశమూ ఇటువంటి నిర్ణయం తీసుకోలేదని అరవింద్ పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయంతో దేశ వృద్ధి రేటు గణనీయంగా తగ్గిందన్నారు. ఈ ఒక్క నిర్ణయంతో చలామణిలో ఉన్న నగదులో 86 శాతం వెనక్కి వెళ్లిందని, జీడీపీ వృద్ధిపై ఇది తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. నోట్ల రద్దుకు ముందు ఆరు త్రైమాసికాల్లో సగటు జీడీపీ వృద్ధి 8 శాతంగా ఉంటే, నోట్ల రద్దు తర్వాత ఏడు త్రైమాసికాల్లో అది 6.8 శాతానికి పడిపోయిందన్నారు. రాజకీయ పరిభాషలో చెప్పాలంటే నోట్ల రద్దు అనూహ్య పరిణామమని అరవింద్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.