కుట్రలు చేసే చంద్రబాబును నమ్మొద్దు: టీఆర్ఎస్ ఎంపీ కవిత

  • రైతులకు నీళ్లు ఆపిన బాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తా!
  • టీ-కాంగ్రెస్ నేతలను మేము పట్టించుకోము
  • ఢిల్లీలో వీళ్ల తాతలతోనే కొట్లాడాం
ఏపీ సీఎం చంద్రబాబు, టీ-కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎంపీ కవిత విరుచుకుపడ్డారు.  జగిత్యాలలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, కుట్రలు చేసే చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు ఆమె సూచించారు. రైతులకు నీళ్లు ఆపిన బాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. టీ-కాంగ్రెస్ నేతలను తామేమీ పట్టించుకోమని, ఢిల్లీలో వీళ్ల తాతలతోనే కొట్లాడామని, తమకు అడ్డంపడితే తొక్కుకుంటూ వెళ్తామని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం నుంచి వచ్చిన తాము ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. 
Go Back to Shorts
Chandrababu
congres
TRS
kavitha

More Telugu News