murugadoss: మురుగదాస్ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనట!

షార్ట్స్‌లో చూడండి
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కార్' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా 250 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా .. కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాస్పదమైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ఠను దిగజార్చేలా .. ప్రభుత్వ పథకాలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు వున్నాయంటూ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో మురుగదాస్ కొన్ని సన్నివేశాలను తొలగించాడు.

అయితే అంతటితో ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు శాంతించలేదనేది తాజా సమాచారం. జరిగిన దానికి మురుగదాస్ బహిరంగ క్షమాపణ చెప్పవలసిందేననీ, ఇకపై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ సినిమాలు తీయనని హామీ పత్రం రాసి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ విషయంపై స్పందించిన మురుగదాస్ లాయర్, ఆయనతో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.     
Go Back to Shorts
murugadoss

More Telugu News