రాహుల్, కేసీఆర్, ఒవైసీ ఒక్కటవుతారు: జీవీఎల్
- మహాకూటమి, టీఆర్ఎస్, ఎంఐఎం అన్నీ ఒకే తాను ముక్కలు
- ఎన్నికల తర్వాత అందరూ భాయి భాయి అనుకుంటారు
- కేసీఆర్ గురించి సోనియాగాంధీ ఒక్క మాట కూడా అనలేదు
గతంలో కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతిపై నాలుగున్నరేళ్ల కాలంలో కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదనే విధానపరమైన నిర్ణయాన్ని అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆనాడే తీసుకుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ చేస్తున్నారని విమర్శించారు.