సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు.. రూ.28 లక్షలు నొక్కేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు!
- మా కార్యక్రమానికి సోనాక్షి రావాల్సిఉంది
- పారితోషకంతో పాటు విమానం టికెట్లు ఇచ్చాం
- రాకుండా మమ్మల్ని మోసం చేశారు
అయితే నగదును తిరిగి ఇవ్వాలని గట్టిగా కోరడంతో తమను చంపేస్తామని సోనాక్షి మేనేజర్ బెదిరిస్తున్నారని కంపెనీ యజమాని ప్రమోద్ శర్మ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని మురాదాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. కాగా, ఈ వ్యవహారంపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సినిమా 'లింగా'తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్-1, దబాంగ్-2, అఖిర, రౌడీ రాథోడ్, రాజ్ కుమార్, సన్ ఆఫ్ సర్దార్, లుటేరా, హాలీడే సినిమాల్లో సోనాక్షి మెరిసింది.