kukatpalli: టీఆర్‌ఎస్‌కు షాక్‌... కూకట్‌పల్లి ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు రాజీనామా

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలకు ఇంకా రెండు వారాల గడువు కూడా లేని పరిస్థితుల్లో హైదరాబాద్‌ శివారు కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి, కేటీఆర్‌కు అనుచరుడిగా పేరొందిన గొట్టిముక్కల పద్మారావు పార్టీకి రాజీనామా చేశారు. వెళ్తూ వెళ్తూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు  చేస్తూ లేఖ రాశారు.

తెలంగాణ వాదాన్ని కేసీఆర్‌ ఎప్పుడో మర్చిపోయారని, ఆయన తీరువల్ల పార్టీ పక్కదారి పడుతోందని ఆరోపించారు. పార్టీని ఓ ఇల్లు, ఆ ఇంటికి మీరు పెద్దదిక్కులా భావించి ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఉన్న వారిలో చాలా మందికి అన్యాయం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల వేళ పద్మారావు రాజీనామా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
kukatpalli
TRS
gottimukkal padmarao

More Telugu News