సారీ ..మీ గురించి చెప్పడం మరిచిపోయాను: అల్లు అర్జున్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సారీ ..మీ గురించి చెప్పడం మరిచిపోయాను: అల్లు అర్జున్

  • 'టాక్సీవాలా' హిట్ కొట్టేసింది 
  • అల్లు అర్జున్ పార్టీ ఇచ్చారు 
  • అలా మాట్లాడటం ఆయన గొప్పతనం           
రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' తెరకెక్కింది. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని, థియేటర్ల దగ్గర సందడిని పెంచేసింది. వసూళ్లు పెంచుకుని హిట్ టాక్ తెచ్చుకోవడానికి ఈ సినిమాకి ఎంతో సమయం పట్టలేదు. తాజాగా రాహుల్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. 'టాక్సీవాలా' హిట్ అయిన సందర్భంగా అల్లు అర్జున్ మా అందరికీ బీ - డబ్స్ లో పార్టీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన నన్ను కాస్త పక్కకి తీసుకెళ్లి 'సారీ' అన్నారు. 'ఎందుకండీ' అన్నాను నేను. 'ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను మీ గురించి చెప్పడం మరిచిపోయాను' అన్నారు. ఫరవాలేదు లెండి .. నేను కొత్త  .. నా వర్క్ ను మీరు చూడలేదు' అన్నాను. తెలిసినా తెలియకపోయినా .. చూసినా చూడకపోయినా స్టేజ్ పై నేను మీ గురించి మాట్లాడాలి .. ఎందుకంటే డైరెక్టర్ అనేది గౌరవప్రదమైన పొజీషన్. అలాంటి మీ గురించి స్టేజ్ పై మాట్లాడటం మరిచిపోయాను .. ఐయామ్ వెరీ సారీ' అన్నారు. బన్నీ అలా మాట్లాడటం ఆయన గొప్పతనం అని రాహుల్ చెప్పుకొచ్చాడు.           
allu arjun
rahul

More Telugu News