రాహుల్ గాంధీతో భేటీ అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- కుంతియాతో కలసి రాహుల్ నివాసానికి వెళ్లిన కొండా
- టీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి గల కారణాల వివరణ
- 23న మేడ్చల్ సభలో కాంగ్రెస్ లో చేరిక
ఈ నెల 23న హైదరాబాద్ మేడ్చల్ సభలో సోనియా, రాహుల్ ల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. నిన్ననే విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కు, ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, ఐదు కారణాలను ప్రస్తావిస్తూ... నిన్న సాయంత్రం మూడు పేజీల లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు ఆయన రాశారు.