తెలంగాణలో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వం: వైసీపీ స్పష్టీకరణ

  • పార్టీ స్టాండ్‌ వెల్లడించిన సీనియర్‌ నాయకుడు రామ్మోహనరావు
  • అభ్యర్థి, అభివృద్ధి ఎజెండాగా ఆయా స్థానాల్లో గెలుపునకు కృషి చేస్తామని వెల్లడి
  • క్రిస్టియన్‌, ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేసే వారికి చేయూత
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తాజాగా ఏ పార్టీకీ మద్దతివ్వమని తెలిపింది. అయితే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, అక్కడ జరిగిన అభివృద్ధి ప్రాతిపదికగా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేసింది.

సనత్‌నగర్‌లోని పార్టీ కార్యాయంలో పార్టీ సీనియర్‌ నాయకుడు వెల్యా రామ్మోహనరావు ఆధ్వర్యంలో నేడు నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహనరావు మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిలో భాగస్వామి అయిన అభ్యర్థులకు మాత్రమే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే స్థానికంగా క్రిస్టియన్, ముస్లిం శ్మశాన వాటికల అభివృద్ధికి కృషి చేసిన వారి గెలుపుకోసం పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Go Back to Shorts
YSRCP
political stand
velya rammohan

More Telugu News