చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
- యాదాద్రి జిల్లా ఆలేరు వద్ద ఘటన
- రైలులోని S5 కోచ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- ప్రాణభయంతో రైలు నుంచి కిందకు దూకేసిన ప్రయాణికులు
- పలువురికి స్వల్ప గాయాలు, తప్పిన ప్రాణనష్టం
చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలులోని S5 కోచ్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రైలు ఆలేరు స్టేషన్ పరిధిలోకి రాగానే S5 బోగీలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు రైలు నెమ్మదిస్తుండగానే కిందకు దూకేశారు. ఈ క్రమంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానిక అగ్నిమాపక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా రైల్వే సిబ్బంది వెంటనే S5 కోచ్‌ను మిగతా రైలు నుంచి వేరు చేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై రైల్వే అధికారులు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం కలిగింది.