మహాకూటమిలో ట్విస్ట్... 94కు బదులు 100 స్థానాల్లో పోటీకి దిగిన కాంగ్రెస్!
- 100 మందికి బీఫామ్ లు ఇచ్చిన ఉత్తమ్
- ఇబ్రహీంపట్నంలో అయోమయం
- కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ అంటున్న కాంగ్రెస్
హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డికి, దుబ్బాకలో మద్దుల నాగేశ్వర్ కు, పటాన్ చెరులో కాట శ్రీనివాస్ కు ఉత్తమ్ బీఫామ్ లు ఇచ్చారు. టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నం సీటులో ఆ పార్టీ సామ రంగారెడ్డికి బీఫామ్ ఇవ్వగా, నేడు ఉత్తమ్ మల్ రెడ్డి రంగారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ స్థానంలో అయోమయం నెలకొంది. వరంగల్ తూర్పు, మహబూబ్ నగర్, మిర్యాలగూడల్లో మహాకూటమి పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని కాంగెస్ వర్గాలు అంటున్నాయి.