పోరాటయోధుడి జీవితచరిత్రగా 'కబాలి' దర్శకుడి మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోరాటయోధుడి జీవితచరిత్రగా 'కబాలి' దర్శకుడి మూవీ!

  • రంజిత్ దర్శకత్వంలో హిందీ మూవీ 
  • 'బిర్సా ముండా' జీవితచరిత్ర ఆధారం 
  • త్వరలో నటీనటుల ఎంపిక  
'కబాలి' .. 'కాలా' సినిమాలతో దర్శకుడిగా పా రంజిత్ తన సత్తా చాటుకున్నాడు. ఈ రెండు సినిమాల్లోను ఆయన రజనీకాంత్ ను చూపించిన విధానం ప్రశంసలు అందుకుంది. అలాంటి రంజిత్ బాలీవుడ్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. చారిత్రక నేపథ్యంలో సాగే ఒక పోరాట యోధుడి కథ ఇది.

ఉత్తరాదిన ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వీరులలో 'బిర్సా ముండా' ఒకరు. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను 'నమా పిక్చర్స్'వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. ఈ సినిమాను హిందీలో నిర్మించినప్పటికీ, తెలుగు .. తమిళ భాషల్లోను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ చారిత్రక చిత్రాన్ని రంజిత్ వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తాడో చూడాలి.   
ranjith

More Telugu News