మేడే విషయమై వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కిన త్రిపుర సీఎం
- ప్రభుత్వోద్యోగులు కార్మికులు కాదు
- ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలి?
- కర్మాగారాలలో పనిచేసే లేబర్‌కి మాత్రమే సెలవు
నేడు త్రిపురలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న విప్లవ్ దేవ్ మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వోద్యోగులు కార్మికులు కాదు. కర్మాగారాలలో పనిచేసే లేబర్‌కి మాత్రమే ఆ రోజున సెలవు ఇస్తారు. మరి మేడే రోజున ప్రభుత్వోద్యోగులకు సెలవు ఎందుకు ఇవ్వాలి? అందుకే ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ఆ రోజున సెలవు ఇచ్చేది లేదు’’ అన్నారు. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.