అయోధ్యపై ఇంత తొందరేల?: సుప్రీంకోర్టు
- జనవరిలో విచారిస్తామని చెప్పాం కదా?
- ముందస్తు విచారణ ఇక ఎందుకు?
- పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఇప్పటికే కోర్టు ఈ కేసులో ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేసిన ధర్మాసనం, అప్పీళ్లన్నింటినీ జనవరిలోనే పరిశీలిస్తున్నామని, ముందస్తు విచారణకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలిపింది. ఈ పిటిషన్ ను అఖిల భారత హిందూ మహాసభ తరపున న్యాయవాది బరుణ్ కుమార్ సిన్హా దాఖలు చేసి, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, ఈలోగానే కేసును విచారించాలని వాదించారు.