Congress: చత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు ముందు కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ.. రాష్ట్ర ఉపాధ్యక్షుడి రాజీనామా!

షార్ట్స్‌లో చూడండి
పోలింగ్‌కు ముందు చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఘనరామ్ సాహు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన సాహు దుర్గ్ సిటీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. తనకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని 8 స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఆయన తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Go Back to Shorts
Congress
Chhattisgarh
Elections
BJP
Ghanaram Sahu
Amit shah

More Telugu News