ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిలదీసినా కోపగించుకోవద్దు: టీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్
- ప్రజలు నిలదీసినా ఓపికతో ఉండాలి
- నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి
- మన దరిదాపుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవు
నాలుగేళ్లుగా చేసిన పనులు, సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. మన దరిదాపుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవని, దాదాపు వంద స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నెల 15 నుంచి రెండు హెలీకాప్టర్లలో తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ భేటీలో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.