కొరటాల మూవీలో చిరూ నాయికగా హ్యుమా ఖురేషి?
- కొరటాలతో చిరూ మూవీ
- కథపై జరుగుతోన్న కసరత్తు
- సంక్రాంతి తరువాత లాంచ్
ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'హ్యుమా ఖురేషి' పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రజనీ సరసన 'కాలా' సినిమాలో చేసిన కారణంగా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చిరూ మూవీ కోసం ఆమెను ఎంపిక చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే, ఆమెనే ప్రధాన కథానాయికనా? లేదంటే మరో హీరోయిన్ వుండనుందా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.