swamy paripoornananda: కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన స్వామి పరిపూర్ణానంద

షార్ట్స్‌లో చూడండి
ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై శ్రీపీఠం పీఠాధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హిందువుకు రక్షణ లేకుండా పోయిందని ఆయన వాపోయారు. వరంగల్ లో సాయిబాబా మందిర పూజారిపై ఓ ముస్లిం మతోన్మాది చేసిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

 పూజారి అంతిమయాత్రకు వెళ్తే, వందలాది మంది పోలీసులను రంగంలోకి దించారని మండిపడ్డారు. ప్రస్తుతం రజాకార్ల పాలన కొనసాగుతోందని... దారుస్సలాం (ఎంఐఎం) కనుసన్నల్లోనే ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. దారుస్సలాం కనునన్నల్లో కాకుండా, లాల్ దర్వాజ కనుసన్నల్లో ప్రభుత్వం నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ అంటే నిజామే అని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నారని పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. జీసన్ పాలన తీసుకొస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రతి హిందువు ఓటు వేయాలని... ఎవరు బాగా పరిపాలిస్తారో వారికే ఓటు వేయాలని కోరారు. బీజేపీకి కులమతాలు ఉండవని అన్నారు.
Go Back to Shorts
swamy paripoornananda
kcr
bjp
TRS

More Telugu News