నిజామ్ కాలంనాటి ప్రేమకథతో మెగా హీరో
- కొత్త కథలకి వరుణ్ ప్రాధాన్యత
- త్వరలో 'అంతరిక్షం' విడుదల
- తదుపరి ప్రాజెక్టుకి సన్నాహాలు
ఇటీవలే దర్శకుడు సాగర్ చంద్ర .. వరుణ్ కి ఒక కథ వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. 'కంచె' మాదిరిగానే ఈ కథ కూడా చారిత్రక నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. నిజామ్ కాలం నాటి ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు. 'అంతరిక్షం' విడుదలైన తరువాత ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.