వరుసగా తొమ్మిదో రోజూ... తగ్గిన పెట్రోలు ధరలు!

  • ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు
  • పెట్రోలుపై 25 పైసల ధర తగ్గింపు
  • డీజిల్ పై 7 పైసలు తగ్గిన ధర
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్న నేపథ్యానికి తోడు, డాలర్ తో రూపాయి మారకపు విలువ బలపడుతూ ఉండటంతో 'పెట్రో' ఉత్పత్తుల ధరలు దిగివస్తున్నాయి. ఇండియాలో వరుసగా తొమ్మిదో రోజూ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. శుక్రవారం నాడు లీటరు పెట్రోలుపై 25 పైసలు, డీజిల్ పై 7 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 80.25, డీజిల్ ధర రూ. 74.73కు చేరుకున్నాయి. ఇదే సమయంలో ముంబైలో పెట్రోలు ధర రూ. 86.33, డీజిల్ ధర రూ. 78.33కు తగ్గాయి. విజయవాడలో పెట్రోలు రేటు రూ. 85.01, డీజిల్ రూ. 80.17కు చేరుకుంది. గుంటూరులో పెట్రోలు ధర రూ. 85.21కి, డీజిల్ రూ. 80.37కు తగ్గింది.
Go Back to Shorts
Petrol
Diesel
Crude Oil
Price Slash

More Telugu News