అర్జున్ విషయంలో ఆధారాలు వున్నాయి .. వెనక్కి తగ్గేది లేదు: శ్రుతి హరిహరన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అర్జున్ విషయంలో ఆధారాలు వున్నాయి .. వెనక్కి తగ్గేది లేదు: శ్రుతి హరిహరన్

  • చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నాను
  • పరువునష్టం దావా వేస్తే ఎదుర్కుంటాను
  • ఎవరి బెదిరింపులకు నేను భయపడను
హిందీ చిత్రపరిశ్రమపై మీ టూ ఎఫెక్ట్ ఒక రేంజ్ లో వుంది. అది కాస్తా ఇప్పుడు కన్నడ చిత్రపరిశ్రమలోని వాతావరణాన్ని కూడా వేడెక్కిస్తోంది. సీనియర్ హీరో అర్జున్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఇటీవల నటి శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కానీ అర్జున్ తమకి ఎప్పటి నుంచో తెలుసుననీ, ఆయన చాలా మంచివాడని చాలామంది సినీ ప్రముఖులు సమర్థిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రుతి హరిహరన్ మరోసారి స్పందిస్తూ .. " అర్జున్ పై చేసిన ఆరోపణలకు నేను పూర్తిగా కట్టుబడి వున్నాను. ఆయన నాపై పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా వున్నాను. నా దగ్గర ఆధారాలు వున్నాయి .. బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదు. ఈ విషయంలో నన్ను విమర్శిస్తోన్న వాళ్లకి నేను సాక్ష్యాలు చూపించవలసిన అవసరం లేదు. ఈ వ్యవహారం కోర్టువరకూ వెళితే అక్కడ ఆధారాలు సమర్పిస్తాను" అని చెప్పుకొచ్చారు.  
arjun
sruthi hariharan

More Telugu News