కోహ్లీ సెంచరీ.. శతకం దిశగా రోహిత్.. దీటుగా బదులిస్తున్న టీమిండియా
- వన్డేల్లో 36వ సెంచరీ చేసిన కోహ్లీ
- 79 పరుగులతో ఆడుతున్న రోహిత్
- ఇండియా స్కోరు వికెట్ నష్టానికి 198 పరుగులు
97 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ రోచ్ బౌలింగ్ లో డీప్ ఎక్స్ ట్రా కవర్ మీద ఫోర్ కొట్టి సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్ లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న రెండు బంతులను కూడా కోహ్లీ బౌండరీకి తరలించాడు. ప్రస్తుతం కోహ్లీ 110 పరుగులు, రోహిత్ 79 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు 28 ఓవర్లలో 198 పరుగులు. ఇండియా గెలవాలంటే మరో 125 పరుగులు సాధించాల్సి ఉంది.