కౌశల్ కి ఆ తరహా విలన్ పాత్రలు చేయాలనుందట!
- 'ధ్రువ'లో విలన్ పాత్రను మరిచిపోలేం
- 'అరవింద'లో జగపతి పాత్ర అద్భుతం
- నన్ను నేను నిరూపించుకోవాలని వుంది
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఆ మధ్య వచ్చిన 'ధ్రువ' సినిమాలో విలన్ గా అరవిందస్వామి చేసిన పాత్రను అంత తేలికగా మరిచిపోలేం. అలాగే రీసెంట్ గా వచ్చిన 'అరవింద సమేత' సినిమాలో విలన్ గా జగపతిబాబు పోషించిన పాత్ర కూడా అద్భుతం. అలాంటి విలన్ పాత్రలు చేయాలనుంది .. ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలని వుంది. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాను" అని కౌశల్ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.