యువతి ప్రతిఘటించడంతో బావిలోకి నెట్టాడు.. తనూ పడ్డాడు!
- జనగామ జిల్లాలో ఘటన
- ఇంటర్ యువతిని ఎత్తుకెళ్లిన యువకుడు
- యువతి ప్రతిఘటించడంతో బావిలోకి నెట్టేసిన వైనం
అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించగా, తన ప్రయత్నం బెడిసి కొట్టిందనుకుని, ఆమెను పక్కనే ఉన్న బావిలోకి నెట్టే క్రమంలో తాను కూడా పడిపోయాడు. బావిలో పడ్డ యువతి కేకలు వేస్తుండటంతో స్థానికులు వచ్చి ఆమెను బయటకు తీశారు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి, రాజేష్ ను కూడా బయటకు తీసి పోలీసులకు అప్పగించారు. యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వర్దన్నపేట సీఐ కరుణాసాగర్ రెడ్డి వెల్లడించారు.