డీజీపీపై నమ్మకం లేదు.. సెంట్రల్ సెక్యూరిటీ ద్వారా రక్షణ కల్పించండి: రేవంత్ రెడ్డి
- టీఆర్ఎస్ పార్టీ శిక్షణ కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు
- నన్ను అంతమొందిస్తామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు
- కేసీఆర్ గురించి నాయిని చేసిన వ్యాఖ్యలను సుమోటాగా తీసుకోవాలి
ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారంటూ నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లానని రేవంత్ తెలిపారు. దీన్ని సుమోటాగా తీసుకోవాలని లేదా తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని కోరానని చెప్పారు.