అద్దె ఇంట్లో ఉంటున్నాను .. నా తల్లి రుణం తీర్చుకోవడానికే ప్రైజ్ మనీ ఇచ్చేశాను: కౌశల్
- నేను బాగా డబ్బున్నవాణ్ణి కాదు
- నాకు మదర్ సెంటిమెంట్ ఎక్కువ
- కేన్సర్ తో ఏ తల్లీ బాధపడకూడదు
డబ్బులున్న వాళ్లకి యాటిట్యూడ్ వుంటుంది. ఆ యాటిట్యూడ్ వున్నవాళ్లు అవతల వాళ్లు ఒక్కమాట అన్నా పడరు. 'నన్ను అంటావా' అని చెప్పేసి .. తలుపులు తీసేయండి అంటూ బయటికి వెళ్లిపోతారు. నాకు మదర్ సెంటిమెంట్ చాలా ఎక్కువ. నా తల్లి కేన్సర్ తో బాధపడుతూ చనిపోయింది. అలా మిగతా వాళ్ల తల్లులు ఆర్ధికంగా బాధపడకూడదనే నాకు వచ్చిన ప్రైజ్ మనీ అంతా కూడా ఇచ్చేశాను. నా తల్లి రుణం తీర్చుకోవడానికే అలా చేశాను" అని చెప్పుకొచ్చాడు.