badminton: పాస్ పోర్ట్ పోగొట్టుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్.. సాయం కోసం సుష్మాకు విజ్ఞప్తి!

షార్ట్స్‌లో చూడండి
భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ఇబ్బందులలో పడ్డాడు. ప్రస్తుతం నెదర్లాండ్స్ లో పర్యటిస్తున్న కశ్యప్ పొరపాటున తన పాస్ పోర్టును పోగొట్టుకున్నాడు. వరుసగా నాలుగు టోర్నమెంట్లలో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో పాస్ పోర్ట్ కనిపించకపోవడంతో కశ్యప్ కేంద్ర సాయాన్ని అర్థించాడు. దయచేసి తనకు సాయం చేయాలని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ లో అర్ధించాడు.

‘గుడ్ మార్నింగ్ మేడమ్.. నిన్న రాత్రి ఆమెస్టర్‌డామ్‌లో నా పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నాను. నేను ఇప్పుడు డెన్మార్క్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, జర్మనీ ఓపెన్‌, సార్లౌక్స్‌ ఓపెన్‌లో ఆడాల్సి ఉంది. ఆదివారం డెన్మార్క్‌కు వెళ్లడానికి టికెట్ కూడా తీసుకున్నాను. సుష్మా జీ దయచేసి ఈ విషయంలో నాకు సాయం చేయండి’ అని ట్వీట్ చేశాడు. తన ట్వీట్‌ను క్రీడా శాఖా మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌, ప్రధాని నరేంద్ర మోదీలకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ హిమంత బిశ్వ శర్మలకు ట్యాగ్ చేశాడు.
Go Back to Shorts
badminton
sports
parupalli kasyap
pass port lost
sushma swaraj
India

More Telugu News