ఆయేషా మీరా హత్యకేసులో రికార్డులన్నీ ధ్వంసం.. హైకోర్ట్ ఆగ్రహం!
- ఆయేషా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సిట్
- కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డుల ధ్వంసం
- 4 వారాల్లో నివేదిక సమర్పించాలి
గతంలో మూడో నివేదిక సమర్పించిన అనంతరం ఆయేషా మీరా తరఫు న్యాయవాదులు స్థానిక కోర్టులో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఇలా రికార్డులు ధ్వంసమయ్యాయని పేర్కొనడంపై హైకోర్టు ఆశ్చర్యంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డుల ధ్వంసంపై విచారణ జరిపి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.