ప్రజలు కోరుకుంటే కేసీఆర్ పై పోటీ చేస్తా: గద్దర్
- గజ్వేల్ లో ఓటు హక్కును నమోదు చేసుకున్నా
- అక్కడ నుంచే పోటీ చేస్తా
- ప్రతిపక్షాలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటా
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ ను నిన్న గద్దర్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మనీ, మీడియా, మాఫియా మధ్య ఓటు బందీ అయిందని చెప్పారు. ఓటు హక్కును నమోదు చేసుకోవడంతో మీరు భారతీయుడు అయ్యారని రజత్ కుమార్ తనతో అన్నారని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమిని ఇస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. లక్ష ఉద్యోగాలు, రెండు పడకల ఇళ్లు ఏమయ్యాయని నిలదీశారు. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.