స్వచ్ఛ భారత్ పేరుతో బ్యాంకులను ఊడ్చేస్తున్న మోదీ: విరుచుకుపడిన ఎంపీ రామ్మోహన్నాయుడు
- ప్రత్యేక హోదా అడిగితే రక్షణ నిధులు ఇవ్వాలా అంటారా?
- మీరు దేశానికి ప్రధానా? లేక, కార్పొరేట్ సంస్థలకా?
- రాఫెల్ డీల్‌పై మాట్లాడడం లేదెందుకు?
మోదీ తీరు చూస్తుంటే ఆయన కార్పొరేట్ సంస్థలకే తప్ప దేశానికి ప్రధాని కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారిని సురక్షితంగా దేశం దాటిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా మోదీ మౌనం వీడాలని కోరారు. జీఎస్టీ అమలు వల్ల నష్టపోయిన చిన్న వ్యాపారులను ఆదుకోవాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.