వచ్చే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో ఉరుములతో కూడిన వర్షాలు: వాతావరణశాఖ
- సోమవారం టాటా చెప్పేయనున్న నైరుతి రుతుపవనాలు
- ఈశాన్య రుతుపవనాల ప్రవేశం
- అల్ప పీడనంగా మారనున్న ఆవర్తనం
మరోవైపు నైరుతి ఉపసంహరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, శనివారం మచిలీపట్నం, కర్నూలు నుంచి రుతు పవనాలు నిష్క్రమించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నాటికి ఇవి దక్షిణాది నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయని, ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వివరించారు.