కాలేజ్ లెక్చరర్ గా ఈషా రెబ్బా!
- చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన ఈషా రెబ్బా
- 'అరవింద'లో రెండో నాయికగా పెద్ద ఛాన్స్
- కన్నడలోను హీరోయిన్ గా అవకాశం
చిన్న చిన్న సినిమాలతోనే కెరియర్ ను నెట్టుకొస్తోన్న ఆమె, 'అరవింద సమేత'లో రెండో కథానాయికగా చేయడం విశేషం. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, కన్నడలో హీరోయిన్ గాను ఛాన్స్ కొట్టేసింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన కథానాయికగా ఆమె నటించనుంది. ఈ సినిమాలో ఆమె కాలేజ్ లెక్చరర్ గా కనిపించనుందట. ఈ నెల చివరివారం నుంచి ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ కానుంది. ఈ రెండు సినిమాలతో ఈషా రెబ్బా మరింత బిజీ అవుతుందేమో చూడాలి.