అదో చిన్న ఘటన... ఇంత రాద్ధాంతమెందుకు?: అనుపమా పరమేశ్వరన్
- అనుపమను ప్రకాశ్ రాజ్ తిట్టాడని వార్తలు
- ఏడుస్తూ కళ్లు తిరిగి పడిపోయిందని ప్రచారం
- చాలా చిన్న విషయమని తీసిపారేసిన హీరోయిన్
ప్రకాష్ రాజ్ తనకో చిన్న సలహాను ఇచ్చారని, అది ఆయన్నుంచి తనకు చేరేసరికి పుకారుగా మారిందని చెప్పింది. ఈ ఘటన జరిగిన తరువాత కూడా తాము 25 రోజులు కలసే షూటింగ్ చేశామని, తమ మధ్య సత్సంబంధాలే ఉన్నాయని వెల్లడించింది. ప్రకాష్ రాజ్ తో కలసి పని చేయడం తనకు ఆనందాన్ని ఇస్తుందని, చిన్న చిన్న విషయాలకు సొంత కథనాలు జోడించి చెబితే, సినీ జనాలకు ఆసక్తి ఉంటుందని, అందుకే ప్రచారం కోసం చిన్న ఘటనను, తనను వాడుకున్నారని చెప్పుకొచ్చింది.