ఫ్రెండ్స్ తో పందెంకట్టి న్యూడ్ గా డబ్ స్మాష్ వీడియో చేసిన యువతి... ఆపై ఫోన్ పోగొట్టుకుంటే జరిగిన నష్టమిది!

వెర్రితలలు వేస్తున్న ఆధునిక పోకడలు, నేటి తరం యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకు ఎంత ముప్పును తెచ్చి పెడుతున్నాయో చెప్పకనే చెబుతున్న ఘటన ఇది. ఇటీవల హైదరాబాద్ పోలీసుల ముందుకు ఈ ఘటన రాగా, దీన్ని పూర్తిగా బహిర్గతం చేసేందుకు పోలీసులు అంగీకరించలేదు. అసలేం జరిగిందంటే, కొంతకాలం క్రితం ఓ ఇంజనీరింగ్ యువతి, తన ఫ్రెండ్స్ తో రూ. 10 వేలు పందెం కట్టి, నగ్నంగా ఓ సినిమా పాటకు డబ్ స్మాష్ చేస్తూ, తన సెల్ ఫోన్ లో చిత్రీకరించింది. దాన్ని ఎవరికీ పంపించని ఆమె, స్నేహితురాళ్లకు మాత్రం చూపించి డబ్బు గెలుచుకున్నానని సంబరపడింది.

ఆమె సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఒకరోజు బయటకు వెళ్లిన వేళ, ఆమె తన సెల్ ఫోన్ పోగొట్టుకుంది. ఆపై రెండు రోజుల తరువాత, ఓ యువకుడు ఫోన్ చేసి, "నీ న్యూడ్ వీడియోలు నాదగ్గర ఉన్నాయి. రూ. 2 లక్షలు ఇవ్వకుంటే వాటిని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేస్తా" అని బెదిరింపులకు దిగాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని యువతి షీ టీమ్స్ ను ఆశ్రయించి, తన గోడును వెళ్లబోసుకుంది. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, ఆ యువకుడిని గుర్తించి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆ అమ్మాయిని హెచ్చరించి పంపారు.

కొంతమంది అమ్మాయిలు స్నానం చేస్తూ వీడియోలు తీసుకుంటున్నారని, వాటిని స్నేహితురాళ్లతో పంచుకుంటున్నారని,ఈ తరహా ఘటనలు ఏ మాత్రం కూడదని పోలీసులు సలహా ఇస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Police
Nude Video
Girl

More Telugu News