ముగిసిన స్టే గడువు... 10న హాజరు కావాలని ఏపీ స్పీకర్ కోడెలకు కోర్టు ఆదేశం
- కోడెలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు
- ఎన్నికల్లో రూ. 11.50 కోట్లు ఖర్చు చేశానన్న కోడెల
- గతనెల 27తో ముగిసిన స్టే గడువు
ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద విచారణ సాగగా, ఈ కేసులో విచారణ నిలుపుదల చేయాలంటూ కోడెల హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. గత నెల 27తో స్టే గడువు ముగిసింది. ఈ నెల 10న కోర్టుకు నేరుగా హాజరు కావాలని న్యాయమూర్తి కోడెలను ఆదేశించారు. కాగా, అంత పెద్ద మొత్తంలో డబ్బును ఎందుకు ఖర్చు పెట్టారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి ఇచ్చారో విచారించాలని, డబ్బుపై ఐటీ అధికారులతో విచారణ జరిపించాలని పిటిషనర్ కోర్టును కోరుతున్నారు.