వెండితెరకి మరో నట వారసుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెండితెరకి మరో నట వారసుడు

  • రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై సినిమా 
  • ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి 
  • వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
సీనియర్ హీరోలు .. హీరోయిన్ల వారసులే కాదు, కీలకమైన పాత్రలను పోషించే కేరక్టర్ ఆర్టిస్టుల వారసులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అలా హీరోగా తమిళంలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రముఖ నటుడు నాజర్ రెండవ తనయుడు ఉత్సాహాన్ని చూపుతున్నాడట. దాంతో నాజర్ అందుకు సంబంధించిన సన్నాహాలను దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా సమాచారం.

రాజ్ కమల్ ఫిల్మ్స్ వారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో హీరోగా నాజర్ రెండవ తనయుడు 'అబీ మెహదీ'ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.    
nassar

More Telugu News