ముహూర్తం కుదిరింది... అసెంబ్లీ ఎన్నికలకు 12న షెడ్యూల్!
- నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణకు ఎన్నికలు
- నవంబర్ 11 నుంచి 30 మధ్య పోలింగ్
- డిసెంబర్ తొలి వారంలో ఫలితాల వెల్లడి
నవంబర్ 11 నుంచి 17 మధ్య రెండు దశల్లో తెలంగాణ, మిజోరం ఎన్నికలు జరుగుతాయని, అదే నెల 18 నుంచి 24 మధ్య మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, 25 నుంచి 30 మధ్య రాజస్థాన్ లో పోలింగ్ జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్ మెషీన్లు సిద్ధమయ్యాయని, వీటిపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టామని సీనియర్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 10 నాటికి అన్ని రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడేందుకు తమవంతు సహకారాన్ని అందించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.