రూపాయి ఆల్ టైమ్ రికార్డు పతనం... రూ. 73 దాటేసిన డాలర్ విలువ!
- రూ. 73.30 వద్ద కొనసాగుతున్న డాలర్ విలువ
- ఒక్క రోజులో 81 పైసలు నష్టపోయిన రూపాయి
- డాలర్ కు డిమాండ్ పెరుగుతోందన్న నిపుణులు
ఇటీవలి కాలంలో గంటల వ్యవధిలో రూపాయి విలువ 81 పైసలు దిగజారిన సందర్భం ఇదే కావడం గమనార్హం. డాలర్ కు డిమాండ్ పెరగడంతోనే రూపాయి విలువ పడిపోయిందని ఫారెక్స్ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఇదిలావుండగా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 175 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 60 పాయింట్లకు పైగా పతనమైంది.