Kidari: హత్య జరిగిన రోజు... కిడారి కారులో రూ. 3 కోట్లు!

షార్ట్స్‌లో చూడండి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య జరిగిన నాడు ఆయన కారులో రూ. 3 కోట్ల నగదు ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం. నాడు ఆ డబ్బును మైనింగ్ సెటిల్ మెంట్ కోసం తీసుకెళుతున్నారా? లేక మావోయిస్టులకు ఇచ్చేందుకే పట్టుకెళుతున్నారా? అన్న విషయమై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది.

హత్య తరువాత కారు నుంచి ఆ డబ్బు మాయం కాగా, దీన్ని మావోలు తీసుకు వెళ్లారా? లేక ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న మరెవరైనా తీసుకెళ్లారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ మాజీ ఎంపీపీ ధనీరావుతో పాటు కొండబాబు, త్రినాథరావు, అంత్రిగూడకు చెందిన శోభన్, కొర్రా కమల, పొంగిదాసు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Go Back to Shorts
Kidari
Araku
Murder

More Telugu News