Biggboss: బిగ్ బాస్ హౌస్ ముందు నానాయాగీ చేసిన కౌశల్ ఆర్మీ... రంగంలోకి పోలీసులు, షూటింగ్ నిలిపివేత!

షార్ట్స్‌లో చూడండి
అధికారికంగా మరికొన్ని గంటల్లో ముగియనున్న బిగ్ బాస్ - సీజన్ 2లో గెలిచేది తమ అభిమాన కౌశలేనన్న నిర్ణయానికి వచ్చిన కౌశల్ ఆర్మీ, నిన్న రాత్రి బంజారాహిల్స్ లోని బిగ్ బౌస్ హౌస్ వద్ద నానాయాగీ చేసింది. విన్నర్ ఎవరనే చర్చ సాగుతున్న వేళ, నిన్న రాత్రి సుమారు 300 మంది కౌశల్ అభిమానులు, ఫైనల్ షూట్ ను చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చి, "కౌశల్... కౌశల్" అని అరుస్తూ గోలగోల చేశారు.

 దీంతో షూటింగ్ కు ఇబ్బంది కలుగడంతో, పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారిని చెదరగొట్టారు. అభిమానుల తాకిడితో షూటింగ్ ను నిలిపివేసిన స్టార్ మా, ప్రస్తుతం ఫైనల్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం గమనార్హం.
Go Back to Shorts
Biggboss
Finale
Koushal
Koushal Army

More Telugu News